రేపు రాజస్థాన్‌లో మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో నేడు భారీ అగ్నిప్రమాదం
- రాజస్థాన్ హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం
- ప్రధాని మోదీ ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ఘటన
- మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
- ప్రమాదంలో ప్రాణనష్టంపై అధికారిక ప్రకటన లేదు
- ప్రారంభోత్సవ కార్యక్రమంపై నెలకొన్న అనిశ్చితి
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రాలో ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (ఏప్రిల్ 21) మంగళవారం ఈ రిఫైనరీని ప్రారంభించాల్సి ఉండగా, ఒక్కరోజు ముందే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.
దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌గా దీనిని నిర్మించారు. హెచ్‌పీసీఎల్, రాజస్థాన్ ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో సుమారు రూ.79,459 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును చేపట్టారు.
అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, గాయాలు గానీ అయినట్లు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.
రేపు జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై, జాతికి అంకితం చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆయన ఎల్పీజీ ట్యాంకర్లను జెండా ఊపి ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారని షెడ్యూల్ లో పేర్కొన్నారు. కార్యక్రమం కోసం సుమారు 5,000 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన, రిఫైనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం యథాతథంగా జరుగుతుందా లేదా అనే దానిపై అనిశ్చితి నెలకొంది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.